TG : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడికి14 రోజుల రిమాండ్‌

TG : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడికి14 రోజుల రిమాండ్‌
X

జిల్లా కేంద్రంలోని 2 పడక గదుల ఇళ్ల విక్రయం కేసులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత నెల 2న మహబూబ్‌నగర్‌ పట్టణం క్రిస్టియన్‌పల్లి శివారులోని ఆదర్శనగర్‌లో 523 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ భూముల్లో అక్రమాలు జరిగాయని తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఏ4 నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నారని పేర్కొన్న పోలీసులు.. శుక్రవారం అరెస్టు చేశారు. శనివారం శ్రీకాంత్‌గౌడ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించగా మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించారు.

Tags

Next Story