సముద్రంలో మునిగి నలుగురు భారతీయుల మృతి

సముద్రంలో మునిగి నలుగురు భారతీయుల మృతి

ఆస్ట్రేలియాలోని ఫిలిప్ దీవిలో సముద్రంలో మునిగి నలుగురు భారతీయులు మరణించారు. ఈ ఘటనపై గురువారం పోలీసులు సమాచారం అందించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ- మన విక్టోరియా రాష్ట్రంలో 20 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో జగ్జిత్ సింగ్ (23) (Jagjeet singh), సుహానీ ఆనంద్ (Suhani Anand), కీర్తి బేడీ (ఇద్దరూ 20) (Keerti Bedi), రీమా సౌంధి (43) (Reema Saundhi) ఉన్నారాణి చెప్పారు.

పోలీసులను ఉటంకిస్తూ, వార్తా సంస్థ 'పిటిఐ' ఇలా తెలిపింది - జగ్జీత్, సుహాని, కీర్తి విద్యార్థులు క్లైడ్ ప్రాంతంలో నివసిస్తున్నారు . రీమా కొద్దిరోజుల క్రితం ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లింది. బేడీ, సుహానీ స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మృతులంతా బంధువులే.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, 10 మందితో కూడిన బృందం పిక్నిక్ కోసం ఇక్కడకు వెళ్లింది. ఈ బృందంలో ఈ నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారు. విక్టోరియా పోలీస్ కమీషనర్ కరెన్ నెహోల్మ్ మాట్లాడుతూ - చనిపోయిన వారందరూ లోతైన నీటిలోకి వెళ్లారు . ఇంతలో బలమైన కెరటం వారిని సముద్రంలోకి లాగేసింది. సమాచారం తెలిసిన వెంటనే, కొందరు లైఫ్‌గార్డులు అక్కడికి చేరుకుని వారిని బయటకు తీశారు.

నలుగురిని బయటకు తీసినప్పుడు ఒక బాధితుడు ప్రాణాలతో ఉన్నాడు. అతనిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినా కాపాడలేకపోయారు. నీటిలో మునిగి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు భారత హైకమిషన్ కూడా ఈ సంఘటనను ధృవీకరించింది. సోషల్ మీడియా పోస్ట్‌లో - ఇది చాలా బాధాకరం. నలుగురు భారతీయులు మరణించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని హై కమిషన్ పేర్కొంది.

భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక అధికారి మాట్లాడుతూ- ఈ ప్రాంతం ప్రమాదకరమైనది. కొందరు వ్యక్తులు వారిని ఆపడానికి కూడా ప్రయత్నించారు. వారం రోజుల క్రితం కూడా ఇలాంటి ప్రమాదం తృటిలో తప్పింది. అయితే, దాదాపు 20 ఏళ్ల తర్వాత చాలా మంది ఒకేసారి మరణించారు అని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story