బీరు తాగుతూ డ్రైవింగ్.. నలుగురు మృతి
మద్యం మత్తు నలుగురి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పెనుకొండ మండలం ఎర్రమంచిలో ఉన్న కియా కార్ల పరిశ్రమ ప్రధాన గేటు వద్ద.. 44వ జాతీయ రహదారిపై కారు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ మిట్టల్‌తో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కారు డ్రైవర్ బీరు తాగుతూ డ్రైవ్ చేస్తుండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైన కారులో బీరు సీసాను గుర్తించారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతుల్లో బెంగళూరుకు చెందిన మనోజ్ మిట్టల్, ఢిల్లీకి చెందిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం నెమ్మదించడంతో వెనుక నుంచి వచ్చి వీరి కారు ఢీకొట్టినట్లు చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com