Hyderabad : బాలుడిపై లైంగికదాడికి యత్నించిన పండ్ల వ్యాపారి

Hyderabad : బాలుడిపై లైంగికదాడికి యత్నించిన పండ్ల వ్యాపారి
X

హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిధి వివేకానందనగర్ బాలుడిపై ఓ పండ్ల వ్యాపారి లైంగిక దాడికి యత్నించాడు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఓ కుటుంబం నగరానికి వలసవచ్చి స్థానికంగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో వారి ఇంటి సమీపంలోనే పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి బాలుడికి పండ్లు ఇస్తూ మచ్చిక చేసుకుని మంగళవారం రాత్రి సమయంలో నోరుమూసి కత్తితో బెదిరించి లైంగిక దాడికి యత్నించటంతో బాలుడు కేకలు వేశాడు. అప్రమత్తమైన స్థానికులు, కుటుంబ సభ్యులు బాలుడిని కాపాడి, పండ్ల వ్యాపారిని పట్టుకుని దేహశుద్ధి చేసి కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు.

Tags

Next Story