Gachibowli: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మృతి..

X
By - Divya Reddy |18 Dec 2021 8:30 AM IST
Gachibowli: హైదరాబాద్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
Gachibowli: హైదరాబాద్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. గచ్చిబౌలి - హెచ్‌సీయూ రోడ్డులో ఓ కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జూనియర్ ఆర్టిస్టులైన ఎం.మానస, ఎన్.మానసతో పాటు డ్రైవర్ అబ్దుల్లా మృతి చెందారు. సిద్ధు అనే మరో జూనియర్ ఆర్టిస్ట్‌కి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com