TG : హైదరాబాద్ లో దారుణం..లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్
సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న ఓ యువతిని.. పార్టీ పేరుతో హోటల్ కు తీసుకెళ్లిన స్నేహితులు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిటీకి చెందిన ఓ యువతి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. ఇటీవల పార్టీ ఉందని చెప్పి ఆమెను స్నేహితులు ఓ హోటల్ రూమ్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. అందరూ కలిసి మద్యం తాగారు. అయితే, ఆ తర్వాత ఆమెపై స్నేహితులు గ్యాంగ్ కు రేప్ కు పాల్పడ్డారు. వారితో పాటు కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా అత్యాచారం చేసినట్లు చెబుతూ యువతి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతితో పాటు ఉన్న స్నేహితులంతా సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com