కూల్ డ్రింక్‌‌‌‌‌లో మత్తు మందు కలిపి.. పన్నెండేళ్ల బాలిక పై ఇద్దరు యువకుల అత్యాచారం

కూల్ డ్రింక్‌‌‌‌‌లో మత్తు మందు కలిపి.. పన్నెండేళ్ల బాలిక పై ఇద్దరు యువకుల అత్యాచారం
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుకూరులో దారుణం జరిగింది. పన్నెండేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుకూరులో దారుణం జరిగింది. పన్నెండేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లడంతో ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన యువకులు...కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి దారుణానికి ఒడి గట్టారు. ఘటన గురించి ఎవరికి చెప్పొద్దని బాలికను బెదిరించినట్లు తెలుస్తోంది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడాన్ని గుర్తించిన పేరెంట్స్...ఆరా తీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వీరఘట్టం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కేసు నమోదు చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story