Ganja Smuggling Racket : కోదాడలో గంజాయి కలకలం

Ganja Smuggling Racket : కోదాడలో గంజాయి కలకలం
X

సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి కలకలం రేపింది. గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు పాత నేరస్తులు స్కూటీలో గంజాయి తరలిస్తున్నారు. గంజాయిని భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మామిళ్లగూడెం టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముగ్గురి నుంచి 9 కేజీల 300 గ్రాముల గంజాయి.. రెండు సెల్‌ ఫోన్స్‌.. స్యూటీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

Tags

Next Story