Girl Missing : పక్కింట్లో ఆడుకునేందుకు వెళ్లిన బాలిక మిస్సింగ్

Girl Missing : పక్కింట్లో ఆడుకునేందుకు వెళ్లిన బాలిక మిస్సింగ్

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో కిడ్నాప్ కలకలం రేపింది. ఉబెదుల్లా కాలనీలో నివసిస్తున్న అజంతుల్లా, సానియాల కుమార్తె అస్వీయ..రాత్రి 7 గంటల సమయంలో పక్కింట్లో ఆడుకునేందుకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల, బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశారు. కిడ్నాప్‌ కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story