TG : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై అమ్మాయిపై అత్యాచారం

TG : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై అమ్మాయిపై అత్యాచారం
X

సోషల్ మీడియా మోజులో పలువురు అమ్మాయిలు మోసపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ లోని ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని (17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ (22) పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించడంతో ఆమె ఈ నెల 9న సికింద్రాబాద్ వచ్చింది. బాలికను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. బాలిక మెడికల్ కాలేజ్​లో కనిపించకపోవడంతో సిబ్బంది విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయగా బాలిక ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆదిలాబాద్‌కు రప్పించారు.అయితే, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాధితురాలు భయంతో జరిగిన విషయం ఇంట్లో చెప్పేసింది. అనంతరం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా నిందితుడి శివపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags

Next Story