Crime : బాలికపై దుండగుల అత్యాచారం.. గర్భవతి అని తెలిసి పాతిపెట్టేందుకు యత్నం..

ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల రాక్షసపర్వం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజగా ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు రాక్షసులు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకసారి కాదు పలుమార్లు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్నాళ్లకు బాలిక గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు యత్నించారు.
బాలిక 5 నెలల గర్భవతి అని తెలిశాక నిందితులు దారుణ ఘటనకు ఒడిగట్టారు. నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకువెళ్లి సజీవంగా పూడ్చిపెట్టేందుకు ప్రయత్నం చేశారు. గొయ్యిని చూసి భయపడిన బాలిక వారి నుంచి తప్పించుకుని విషయం ఇంట్లో వాళ్లకు చెప్పింది. కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులైన భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్ అనే అన్నదమ్ములను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు తుళు బాబు కోసం గాలిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com