AP : సీతమ్మధారలో దారుణం..మూగ బాలికపై అత్యాచారం..

AP : సీతమ్మధారలో దారుణం..మూగ బాలికపై అత్యాచారం..
X

విశాఖ నగర పరిధిలోని సీతమ్మధారలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మూగ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని సంజ్ఞల ద్వారా తల్లిదండ్రులకు జరిగిన దారుణం గురించి వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ కేసును సీరియస్ గా తీసుకున్న విశాఖపట్నం ఎస్పీ శంఖబ్రత బాగ్చీ బాలిక చెప్పిన వివరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags

Next Story