Jagityal: జగిత్యాల జిల్లాలో అమానుషం.. తాతను బండరాయితో కొట్టి చంపిన మనవడు..

X
Jagityal: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో అమానుషం జరిగింది. సొంత తాతనే చంపేశాడు ఓ మనవడు. మల్లయ్య అనే వృద్ధుడిని అతని మనవడు చందు బండరాయితో కొట్టి కిరాతకంగా హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని తన బైక్ పైనే తీసుకెళ్లాడు.
వృద్ధుడి హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ముసాలయను కళ్లముందే అతికిరాతకంగా కొట్టి చంపుతున్నా ఆపేందుకు గ్రామస్థులు ఎవరూ సాహసించలేదు. తాతను చంపిన చందుకు మతిస్థిమితం సరిగా లేదని బంధువులు చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
