Kerala : బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష

కేరళలో ప్రియుడిని హత్య చేసిన గ్రీష్మకు నెయ్యట్టింకర కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఆమెకు సహకరించిన మామకు 3సం. జైలుశిక్ష పడింది. తనతో రిలేషన్ ముగించేందుకు శరణ్(23) ఒప్పుకోలేదని పెస్టిసైడ్ కలిపిన డ్రింక్ తాగించి చంపేసింది. గ్రీష్మ వయసు (2022లో 22సం.) దృష్ట్యా శిక్ష తగ్గించాలన్న లాయర్‌కు.. క్రూర నేరం, సాక్ష్యాలు చెరిపేసి, దర్యాప్తు తప్పుదోవ పట్టించిన ఆమె వయసును పరిగణించలేమని జడ్జి చెప్పారు.
2022వ సంవత్సరం అక్టోబరు 14న షారన్ రాజ్ (23)ని అతడి గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మ తన పుట్టిన రోజు సందర్భంగా.. చీరాలోని తన ఇంటికి పిలిచింది. అక్కడ ఆమె హెర్బిసైడ్ (పారాక్వాట్) అనే హెర్బల్ మెడిసిన్‌లో విషం కలిపి ప్రియుడు షారన్‌తో తాగించింది. అనంతరం తీవ్ర వాంతులు, శారీరక సమస్యలతో ఆసుపత్రిలో చేరిన షారన్ 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి అదే ఏడాది అక్టోబర్ 25న ఆస్పత్రిలో మరణించాడు.
సముదాయపేట జేపీ భవన్‌కు చెందిన జయరాజ్ కుమారుడు షారన్ నెయూర్. ఇతడు క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్‌లో బీఎస్సీ రేడియాలజీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆయుర్వేద వైద్యుడైన షరాన్ సోదరుడు షిమోన్ రాజ్ హత్యకు దారితీసిన సాక్ష్యాలను వెలికితీయడంలో కేసు కీలక మలుపు తిరిగింది. హెర్బిసైడ్ పారాక్వాట్‌లో గ్రీష్మా విషాన్ని కలిపినట్లు షిమోన్ వైద్య పరీక్షల్లో గుర్తించాడు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా నేరాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com