Gujarat: బీఎస్ఎఫ్ జవాన్ హత్య; కూతురు అడల్ట్ వీడియో వికృత క్రీడలో బలైన తండ్రి
Gujarat

Gujarat: బీఎస్ఎఫ్ జవాన్ హత్య; కూతురు అడల్ట్ వీడియో వికృత క్రీడలో బలైన తండ్రి
అభంశుభం తెలియని తన చిన్నారిని అభ్యంతరకరంగా వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నందుకుగానూ ఓ కుర్రాడిని నిలదీసినందుకు BSFజవాను తన ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ హృదయవిదాకర ఘటన గుజరాత్ లోని ఖేడా జిల్లాలో చోటుచేసుకుంది.
BSF జవాన్ గా సేవలు అందిస్తున్న మేలాజీ వాఘేలా తన భార్య, తనయుడితో కలసి చక్లాసీ గ్రామానికి చెందిన దినేశ్ జాదవ్ ఇంటికి వెళ్లాడు. మైనర్ అయిన తమ కుమార్తెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోను డిలీట్ చేయాల్సిందిగా జాదవ్ కుమారుడిని అడిగాడు. ఇదే విషయమై ఇరు పక్షాల మధ్యా వాదోపవాదాలు ఊపందుకోగా జాదవ్ కుటుంబ సభ్యులు కర్రలతో, పదునైన ఆయుధాలతో మూకుమ్మడిగా మేలాజీపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో మేలాజీ తలకు, ఇతర భాగాలకు బలమైన గాయాలు అవ్వడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మేలాజీ తనయుడు నవదీప్, అతడి భార్య కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈమేరకు ఎఫ్ఐఆర్ ను నమోదు చేసుకున్న పోలీసులు దినేశ్ కుటుంబానికి సంబంధించి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com