Helicopter Crash : అరేబియా సముద్రంలో హెలికాప్టర్ క్రాష్

Helicopter Crash : అరేబియా సముద్రంలో హెలికాప్టర్ క్రాష్
X

గుజరాత్ లోని పోరుబందర్ తీరం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అరేబియా సముద్రంలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్ హెచ్) కూలిపోయిం ది. రెస్క్యూ ఆపరేషన్కు వెళ్తుండగా అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సముద్రంలో హెలి కాప్టర్ కూలడంతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్కు చెందిన ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. పోర్ బందర్ కు 45 కిలోమీటర్ల దూరంలో మోటార్ ట్యాంకర్ హరిలీలాలో గాయపడిన సిబ్బందీని రక్షించడానికి నిన్న రాత్రి 11 గంటలకు అధునాతన తేలికపాటి హెలికాప్టర్ బయ ల్దేరింది. దారిలో సమస్య తలెత్తడంతో అత్యవసర హార్డ్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ఘటనలో ఒకరిని రక్షించగా, మిగతా ముగ్గురు అదృశ్యమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు నౌకలు, రెండు ఎయిర్ క్రాఫ్ట్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు.

Tags

Next Story