అనంతపురం జిల్లాలో హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్..!

అనంతపురంలో హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ వెలుగు చూసింది.. బెంగళూరు వర్సెస్ రాయలసీమ గ్యాంగుల మధ్య సినిమా స్టైల్‌లో వార్ నడిచింది.. అనంతపురం కేంద్రంగా రాయలసీమ హిజ్రాల సంఘం ఆషాఢ మాసం పండుగ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసింది.. ఈ కార్యక్రమానికి బెంగళూరు హిజ్రాల సంఘం నుంచి హిజ్రాలు వచ్చారు.. రాయలసీమ బ్యాచ్ ఐక్యత చూసి అందులో ఒకరిని బెంగళూరు గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.. ఒకరిపై ఎటాక్ చేసి నగలు, డబ్బు లాక్కెళ్లింది.. దీనికి ప్రతిగా బెంగళూరు గ్యాంగ్ నుంచి ఒకరిని కిడ్నాప్ చేసింది రాలయసీమ గ్యాంగ్.. దీంతో రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది.. మీరు ఒకరిని వదిలితేనే మేం కూడా విడిచిపెడతామంటూ డీల్‌కొచ్చాయి ఇరు వర్గాలు.. ఈ నేపథ్యంలోనే అనంతపురం కలెక్టరేట్ ఎదుట రాయలసీమ హిజ్రాల గ్యాంగ్ ఆందోళనకు దిగింది.. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com