UP : ఘోరం.. పెళ్లి చేసుకోమన్నందుకు.. ఏడు ముక్కలుగా నరికాడు..

UP : ఘోరం.. పెళ్లి చేసుకోమన్నందుకు.. ఏడు ముక్కలుగా నరికాడు..
X

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఓ మహిళను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ఏడు ముక్కలుగా చేసి బావిలో పడేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కిశోర్‌పురా గ్రామంలోని ఓ బావిలో మనిషి శరీర భాగాలు ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శరీర భాగాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. అయితే మృతురాలి తల, కాళ్లు లభ్యం కాకపోవడంతో ఆమెను గుర్తించడం కష్టంగా మారింది.

ఈ కేసును ఛేదించడానికి పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. పోస్టర్ల ఆధారంగా మృతురాలి సోదరుడు పోలీసులను సంప్రదించడంతో ఆమెను తికమ్‌గఢ్ గ్రామానికి చెందిన రచన యాదవ్‌గా గుర్తించారు. విచారణలో రచనకు గ్రామ మాజీ ప్రధాన్ సంజయ్ పటేల్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. పెళ్లి చేసుకోవాలని రచన ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేయాలని సంజయ్ పటేల్ తన మేనల్లుడు, స్నేహితుడితో కలిసి పథకం వేశాడు. ఈ పథకం ప్రకారం రచన గొంతు కోసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం మృతదేహాన్ని ఏడు ముక్కలుగా నరికి బస్తాల్లో కుక్కి బావిలో పడేసి, తల, కాళ్లను సమీపంలోని లఖేరి నదిలో పడేశారు. పోలీసులు ప్రధాన నిందితుడు సంజయ్ పటేల్, అతని మేనల్లుడిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నది నుంచి మృతురాలి తలను వెలికితీసినట్లు, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Tags

Next Story