Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. MMTSలో అత్యాచారయత్నం

Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. MMTSలో అత్యాచారయత్నం
X

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. MMTS రైలులో ప్రయాణిస్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె రైలు నుంచి కిందకి దూకడంతో తీవ్రంగా గాయపడింది. యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కొంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. మహిళా బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో నిందితుడు ఆమెపై అత్యాచారానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. తన మెుబైల్ ఫోన్ రిఫేర్ కోసం సికింద్రాబాద్‌కు వెళ్లింది. పని పూర్తి కాగానే గత రాత్రి (మార్చి 23) ఎంఎంటీఎస్‌ ట్రైన్‌లో మేడ్చల్‌కు బయలుదేరింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో మహిళల కోచ్‌లోనే యువతి ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు కూడా ఉండగా.. వారు అల్వాల్‌ స్టేషన్‌లోనే దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండగా.. అందులోనే ఉన్న ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అక్కడ ఎవరు లేకపోవటంతో కాసేపు ప్రతిఘటించింది. ఇక తప్పని పరిస్థితుల్లో ట్రైన్ నుంచి కిందకు దూకేసింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి తీవ్రంగా గాయపడింది. అటుగా వెళ్లిన వారు ఆమెను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags

Next Story