Crime News: భర్త ఘాతుకం.. భార్యను ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్‌లో వేసి..
Crime News: ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ప్రబుద్ధుడు భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపి వాటిని వాటర్ ట్యాంక్‌లో వేశాడు.ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నేరం వెలుగులోకి వచ్చింది, సక్రి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి కుళ్లిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రద్ధా తరహా హత్య కేసు తెరపైకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికి తన ఇంటి వాటర్ ట్యాంక్‌లో పడేశాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సక్రి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి కుళ్లిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
ప్రాథమిక విచారణలో, మహిళను చంపిన రెండు నెలల తరువాత ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త పవన్ సింగ్ ఠాకూర్‌కు భార్యపై అనుమానం. ఈ విషయంపై ఇద్దరి మధ్య రోజూ గొడవలు. దీంతో ఆమెను ఎలాగైన మట్టు పెట్టాలని భావించి ఓ రోజు చంపేశాడు. అనంతరం ఎవరికీ దొరక్కూడదన్న ఉద్దేశంతో శరీరాన్ని ముక్కలు చేసి తన ఇంటి ట్యాంకర్‌లోనే వేశాడు. కానీ చుట్టుపక్కలకు ఆ దుర్ఘందం వ్యాప్తి చెందడంతో అతడు చేసిన నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు పంపి ఠాకూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com