Crime : భార్యను నరికి చంపిన భర్త.. కుషాయిగూడలో దారుణం

మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. భర్త తన భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ సమీపంలోని అడ్డగూడూర్ గ్రామానికి చెందిన బోడ శంకర్, మంజుల దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. శంకర్ నాలుగు రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి కుషాయిగూడలోని మహేశ్ నగర్ కాలనీలో ఉంటున్న తన సోదరి ఇంటికి వచ్చాడు.
శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో శంకర్ కత్తితో విచక్షణారహితంగా తన భార్య మంజులను నరికాడు. ఆమె అరుపులకు ఇంట్లో ఉన్నవారంతా లేవడంతో శంకర్ అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే మంజుల మృతి చెందింది. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పారిపోయిన నిందితుడు శంకర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com