Pune : భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి.. బ్లాక్‌మెయిల్ చేసిన భర్త

కామాంధుల బరితెగింపుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. డబ్బు కోసం సొంత భార్యను కూడా వదలడం లేదు. తాజాగా పూణేలో దారుణం జరిగింది. బాత్రూంలో భార్య స్నానం చేస్తుండగా.. ప్రభుత్వాధికారి అయిన భర్త రహస్యంగా వీడియో తీశాడు. డబ్బు కావాలని.. లేకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో భార్య పోలీసులను ఆశ్రయించింది.
క్లాస్ 1 ప్రభుత్వ ఆఫీసర్ అయిన ఓ మహిళకు.. 2020లో మరో అధికారితో వివాహం జరిగింది. ఇటీవల తాను స్నానం చేస్తుండగా.. భర్తే సీక్రెట్ కెమెరాలతో వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారు, హోమ్ లోన్ చెల్లించడానికి పుట్టింటి నుంచి రూ.1.5లక్షలు తీసుకరావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపింది. లేకపోతే సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తతో పాటు ఆయన కుటుంబసభ్యులు సైతం తనను వేధిస్తున్నట్లు మహిళ ఆరోపించింది. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com