Hyderabad : ప్లాస్టిక్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం

X
By - Vijayanand |18 March 2023 12:13 PM IST
హైదరాబాద్ శాస్త్రీపురంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జూ పార్క్ కు సమీపంలోని ఓ చెత్త ప్లాస్టిక్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్లాస్టిక్ అగ్నికి ఆహుతి అవగా, రెండు వెహికిల్స్ మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటన శనివారం ఉదయం 11గంటలకు జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక దళం మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com