క్రైమ్

Hyderabad Crime: 13 బోగస్‌ సంస్థలు.. రూ.2,200 కోట్లకు పైగా మోసం..

Hyderabad Crime: ఆన్‌లైన్‌ గేమింగ్‌, పెట్టుబడుల పేరుతో భారీ చీటింగ్‌ జరిగినట్లు ఆర్వోసి గుర్తించింది.

Hyderabad Crime: 13 బోగస్‌ సంస్థలు.. రూ.2,200 కోట్లకు పైగా మోసం..
X

Hyderabad Crime: హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగు చూసింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌, పెట్టుబడుల పేరుతో భారీ చీటింగ్‌ జరిగినట్లు ఆర్వోసి గుర్తించింది. ఇప్పటివరకు మొత్తం 2, 200 కోట్లకుపైగా మోసం జరిగినట్లు నిర్ధారించింది. ఈ మోసాలకు పాల్పడిన 13 బోగస్‌ సంస్థలపై ఫిర్యాదు చేసింది. కంపెనీ డైరెక్టర్లు, ఛైర్మన్‌, ప్రమోటర్లపై ఫిర్యాదు చేసింది. నకిలీ పత్రాలతో అనుమతులు తీసుకుని కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మాల్‌ 008, మాల్‌ 98, వైఎస్‌ 0123, రిబేట్‌ యాప్స్‌ పేరుతో మోసాలు చేసినట్లు .. 2వేల 200 కోట్ల రూపాయలను హాంకాంగ్‌కు తరలించినట్లు గుర్తించారు. ఈ నకిలీ కంపెనీల ఏర్పాటు వెనుక చైనా కేటుగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్ట్‌ చేయగా.. చైనీయులకు సహకరించిన ఇద్దరిని పట్టుకునేందుకు సీసీఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. హవాలా మార్గంలో డబ్బులు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story

RELATED STORIES