TG : శంషాబాద్ హనుమాన్ టెంపుల్ లో విగ్రహాలు ధ్వంసం

TG : శంషాబాద్ హనుమాన్ టెంపుల్ లో విగ్రహాలు ధ్వంసం
X

సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటన మరవక ముందే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరో దేవాలయంపై దాడి చేశారు దుండగులు. హనుమాన్‌ టెంపుల్‌లోని నవగ్రహాలను ధ్వంసం చేశారు. ఉదయం పూజ చేసేందుకు వచ్చిన పూజారికి విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో కాలనీ వాసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఓ అనుమానితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నవగ్రహాల ధ్వంసంపై స్థానికులు ఆందోళ చేపట్టారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేవాలయాలపై వరుస దాడుల మీద బీజేపీ, బజరందళ్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story