ఇన్‌స్టాలో ఆరు నెలలుగా పరిచయం.. రమ్య హత్య కేసులో కీలక విషయాలు..!

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను మీడియాకి వెల్లడించారు. నిందితుడు శశికృష్ణను అరెస్టు చేసిన పోలీసులు కేసుకి సంబంధించిన వివరాలను తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రమ్య, శశికృష్ణకు ఆరు నెలలుగా పరిచయం ఉందని, తనని ప్రేమించాలని బస్టాండ్ వద్ద శశికృష్ణ రమ్యను వేధించేవాడని ఇన్‌ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ వివరించారు. అయితే అందుకు రమ్య నిరాకరించి మాట్లాడడం మానేసిందని, దీంతో ప్రేమించకపోతే చంపుతానని నిందితుడు పలుమార్లు బెదిరించడని, అందులో భాగంగానే రమ్యని హత్య చేశాడని అన్నారు. సోషల్ మీడియాలో పరిచయలకి యువత చాలా దూరంగా ఉండాలని, ఒకవేళ ఎవరైనా పరిచయమై వేధిస్తుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. రమ్య విషయంలో ఇదే జరిగితే ఇప్పుడు పరిస్థితి మరొకలా ఉండేదని అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com