Indian Embassy Officer : అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ అనుమానాస్పద మృతి

అమెరికాలోని భారత దౌత్య కార్యాలయంలో ఓ భారత అధికారి మరణం కలకలం రేపింది. ఈనెల 18న వాషింగ్టన్‌లోని ఎంబసీ కార్యాలయం ప్రాంగణంలో ఓ భారత అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటనపై అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే మృతిచెందిన అధికారికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. లా ఎన్ ఫోర్స్ మెంట్, సిక్రెట్ సర్వీసెస్ ద్వారా ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లుగా ఎంబసీ తెలిపింది. వైద్యుల ప్రాథమిక సమాచారం మేరకు అతను ఉరి వేసుకుని చనిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు వెల్లడించింది. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి పంపేందుకు సంబంధిత ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంబసీ పేర్కొంది. మృతుడి కుటుంబ సభ్యుల గోప్యత కోసం మరణించిన అధికారి వివరాలను వెల్లడించడం లేదని తెలిపింది. మరణించిన అధికారి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఎంబసీ హత్యా లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com