వాషింగ్టన్ లో దుండగుడి దాడి.. భారతీయుడి మృతి

వాషింగ్టన్ లో దుండగుడి దాడి.. భారతీయుడి మృతి

అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆగడం లేదు. 2024 ప్రారంభం నుంచి ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా, తాజాగా మరొకరి మృతి అందరికీ షాకిస్తోంది.

ఫిబ్రవరి 2న అమెరికా వాషింగ్టన్ రెస్టారెంట్‌ బయట తాజాగా దాడి జరిగింది. వర్జీనియాకు చెందిన వివేక్ తనేజా తీవ్రంగా గాయపడి ఆపై హాస్పిటల్ లో మృతి చెందాడు. బాధితుడిని కిందపడేసిన నిందితుడు ఆపై పేవ్‌మెంట్‌ కేసి తలను బాదడంతో వివేక్ తీవ్రంగా గాయపడ్డాడు. 41 ఏళ్ల తనేజా అర్ధరాత్రి 2 గంటలు దాటాక రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చి వీధిలోంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్పాట్ లో స్పృహ కోల్పోయిన వివేక్ ను హాస్పిటల్ కు తరలించే సమయంలోనే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు.

సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు వాషింగ్టన్ పోలీసులు. నిందితుడి ఆచూకీ చెప్పాలని కోరిన పోలీసులు.. 25 వేల డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తామన్నారు. షికాగోలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ విద్యార్థి సయ్యద్ ముజాహిర్ అలీపై ఫిబ్రవరిలో దాడిచేసి దుండగులు దోపిడీ చేశారు. నీల్ ఆచార్య, శ్రేయాస్ రెడ్డి బెనిగెర్ (19), వివేక్ సైనీ (25), అకుల్ ధావన్ కూడా ఈ ఏడాది అమెరికాలో మృతి చెందినవారిలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story