Crime : మెదక్ జిల్లాలో అమానవీయ ఘటన: గేదె దూడపై లైంగిక దాడి..

Crime : మెదక్ జిల్లాలో అమానవీయ ఘటన: గేదె దూడపై లైంగిక దాడి..
X

మానవత్వం మంటగలిసిపోతున్న మరో దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పశువులపై జరుగుతున్న పైశాచిక దాడులు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లాలో జరిగిన ఘటన మరువక ముందే, మెదక్ జిల్లాలో ఓ యువకుడు గేదె దూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో నిందితుడి బండారం బయటపడింది.

మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామానికి చెందిన రైతు సిద్ధిరాములు తన వ్యవసాయ క్షేత్రంలోని షెడ్డులో పశువులను కట్టేసి ఇంటికి వెళ్లారు. అదే ప్రాంతంలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన రోహిత్ అనే యువకుడు, అర్ధరాత్రి సుమారు 10 గంటల సమయంలో షెడ్డులోకి ప్రవేశించి ఏడాది వయసున్న గేదె దూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, పశువుల పాకలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ దారుణాన్ని రైతు సిద్ధిరాములు గమనించారు. వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకుని నిందితుడు రోహిత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆగ్రహంతో అతడికి దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు అప్పగించారు. రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు రోహిత్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. కాగా మూగజీవాలపై ఇలాంటి పైశాచిక దాడులు జరగడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది.

Tags

Next Story