Odisha : అమానుషం.. ప్రేమికులను నాగలికి కట్టి పొలం దున్నించిన గ్రామస్థులు

Odisha : అమానుషం.. ప్రేమికులను నాగలికి కట్టి పొలం దున్నించిన గ్రామస్థులు
X

ఒడిశాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ జంటపై గ్రామస్థులు అమానుషంగా ప్రవర్తించారు. వారిని కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కంజామజిరా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అత్త కూతురిని పెళ్లి చేసుకోగా.. ఆ గ్రామంలో అత్త కూతురిని పెళ్లి చేసుకోవడం నిషేధం. ఇదే గ్రామస్థుల కోపానికి కారణమైంది.

ఆ జంటను గ్రామస్తుల సమక్షంలో నిలబెట్టి, తీవ్రంగా అవమానించారు. అంతటితో ఆగకుండా అత్యంత దారుణంగా, వారిద్దరినీ నాగలికి కట్టి పొలం దున్నమని ఆదేశించారు. వారిని కర్రలతో కొడుతూ పొలం దున్నించారు. అంతటితో ఆగకుండా ఆలయంలో శుద్ది కర్మలు చేయించారు. ఈ సంఘటనను కొందరు చూసి బాధపడినా, పెద్దల మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. మరికొందరు దీన్ని 'తప్పు చేసిన వారికి సరైన శిక్ష'గా భావించారు.

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి అమానవీయ చర్యలు సమాజంలో జరగకుండా చూడాలని, ప్రేమించుకున్న జంటలకు రక్షణ కల్పించాలని సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Next Story