సతీష్‌ మృతదేహంపై గాయాలు.. అంతా అనుమానమే..?

సతీష్‌ మృతదేహంపై గాయాలు.. అంతా అనుమానమే..?
X

తిరుమల పరకామణి చోరీ కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాలను, పోలీస్ వ్యవస్థను కుదిపేసింది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న పోలీస్ అధికారి సతీష్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం సంచలనంగా మారింది. సీఐడీ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి ఆయన ప్రయాణిస్తుండగా, తెల్లవారుజామున రైల్వే ట్రాక్ పక్కనే ఆయన మృతదేహం కనిపించింది. సతీష్ శరీరంపై ఉన్న గాయాల కారణంగా ఇది సాధారణ ప్రమాదం కాదని స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైలు ఢీకొని చనిపోయారన్న కథనం అంతా నమ్మించేలా లేకపోవడంతో, ఇది హత్యగా జరిగి ఉండొచ్చనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.

సతీష్ తిరుమలలో పరకామణి చోరీ కేసును మొదట బయట పెట్టిన అధికారి. ఆ కేసులో రవికుమార్ కీలక నిందితుడు. ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో, సతీష్‌పై ఒత్తిడులు పెరగడం సహజంగా మారింది. ఆ సమయంలోనే కేసును రాజీ చేయించారనే ఆరోపణలు వినిపించాయి. అయితే రాజీ కుదుర్చుకున్న విషయం కూడా టీటీడీకి చెప్పలేదు. ఎందుకు రాజీ కుదుర్చుకున్నారు, ఎవరు చేయించారు అనే విషయంలో ఆయన సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.

ఆయన వాంగ్మూలం ఇవ్వకుండా అడ్డుకునేందుకే ఆయన్ను మర్డర్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైలు నుంచి కింద పడేంత అమాయకుడు సతీష్‌ కాదు. అతనో పోలీస్ అధికారి. కాబట్టి అంత ఈజీగా కిండ పడరు. పైగా తెల్లవారు జామున 2.30 గంటల టైమ్ లోనే ఎందుకు ఆయన చనిపోతాడు. ఇది ఆత్మహత్య అని అనలేం. ఎందుకంటే సతీష్ చాలా ధైర్యవంతుడు. పైగా ఆయన మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఆయన్ను కచ్చితంగా మర్డర్ చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పరకామణిలో ఉన్న పెద్ద తలకాయల పేర్లను ఆయన బయటపెడుతాడనే ఇదంతా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.


Tags

Next Story