Kidnap: ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్‌..

Kidnap: ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్‌..

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కలకలం రేపింది.నవభారత్ జంక్షన్‌లో ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్‌కు గురైంది.బాధిత యువతి ఫరీద్‌పేటకు చెందిన దుర్గభవానిగా గుర్తించారు.సైకిల్‌పై కాలేజీకి వెళ్తుండగా కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. అయితే వివాహం అయిన తరువాత కూడా కాపురానికి వెళ్లకుండా తల్లిదండ్రల దగ్గరే ఉండటంతో భర్తే కిడ్నాప్‌ చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story