Terrorist Photo : జమ్మూకశ్మీర్ కాల్పులు.. ఉగ్రవాది తొలి ఫొటో

జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది ఫొటోను జాతీయ మీడియా బయటపెట్టింది. రైఫిల్ పట్టుకుని పరిగెత్తుతూ కనిపించాడు. ఈ దాడిలో 8-10 మంది పాల్గొన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వారిలో 5-7 మంది పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పేర్కొంటున్నాయి. కాల్పుల తర్వాత సమీపంలోని అడవిలోకి పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చేస్తున్నాయి.
అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారతీయులు కోపంతో రగిలిపోతున్నారు. దాడి చేసిన ఉగ్రవాదుల్లో పాకిస్థాన్‌కు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మరోసారి దాయాది గడ్డపైకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని, భారత్ అంటేనే భయపడేలా చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com