పెద్దలు అడ్డుకున్నారు..ఇంతలోనే ట్విస్ట్.. సినిమాను తలదన్నేలా లవ్‌ ఛేజ్‌

పెద్దలు అడ్డుకున్నారు..ఇంతలోనే ట్విస్ట్.. సినిమాను తలదన్నేలా లవ్‌ ఛేజ్‌
Kakinada: తూర్పుగోదావరి జిల్లాలో సినిమాను తలదన్నేలా లవ్‌ ఛేజ్‌ సీన్‌ వెలుగు చూసింది.

Kakinada: ఇద్దరు ప్రేమించుకోవడం, ఆ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం, బలవతంగా మరో పెళ్లి చేసేందుకు ప్రయత్నించడం, స్నేహితుల ఎంట్రీతో ఆ ప్రేమ జంట పారిపోవడం.. ఇలాంటి సీన్లన్నీ సినిమాల్లోనే కనిపిస్తుంటాయి.. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో సినిమాను తలదన్నేలా లవ్‌ ఛేజ్‌ సీన్‌ వెలుగు చూసింది.. కన్న కూతురు ప్రేమ పేరుతో కళ్లముందే దూరమవుతున్న క్షణాలను భరించలేక ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.. గుండెలు బాదుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వెలుగు చూసింది ఈ ఘటన.

కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం దగ్గర ప్రేమజంట, వారి ఫ్రెండ్స్‌ చేసిన హడావిడి సినిమానే తలపించింది. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమజంట కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకునేందుకు వచ్చింది.. అయితే, అప్పటికే అక్కడకు వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆమెకు నచ్చజెప్పి తమ దారికి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.

అయితే, ఇంతలో యువకుడి స్నేహితులు ఎంట్రీ ఇచ్చి ఆమెను కారులో ఎత్తుకుపోయారు. తల్లిదండ్రుల నుంచి బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనతో యువతి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.. కన్నకూతురు తమను కాదని వెళ్లిపోతుంటే తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోడ్డుమీదే కుప్పకూలిపోయారు. అటు ఈ ఘటన అందరినీ కలచివేసింది.. యువతి తల్లి రోదనను చూడలేక అక్కడివారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story