Nannamma Fame Samanvi: రోడ్డు ప్రమాదంలో నటి.. కూతురు మృతి

Nannamma Fame Samanvi: కన్నడ టీవీ నటి అమృత నాయుడు కుమార్తె 'నన్నమ్మ' సూపర్ స్టార్ ఫేమ్ 6 ఏళ్ల సమన్వి జనవరి 13న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. సాయంత్రం 4:30 గంటలకు తల్లీ కూతుళ్లు తమ ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
షాపింగ్ తర్వాత తమ ద్విచక్ర వాహనం తిరిగి వస్తుండగా బెంగళూరు కోననకుంటె క్రాస్ వద్ద వీరిని లారీ ఢీకొట్టినట్లు సమాచారం. సమన్వి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె తల్లి అమృత తీవ్ర గాయాలతో బయటపడింది.
తాజా నివేదికల ప్రకారం, సమన్వి మృతదేహాన్ని తదుపరి లాంఛనాల కోసం ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ఉంచారు. అమృత కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కాగా అమృత నాలుగు నెలల గర్భిణీ అని తెలిసింది. మరోవైపు లారీ డ్రైవర్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటికే లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com