కృష్ణా జిల్లాలో బరితెగించిన పోలీసులు

కృష్ణా జిల్లాలో బరితెగించిన పోలీసులు
కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు బరితెగించారు.కబ్జాదారులతో చెట్టపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్న తీరు వివాదాస్పదం అవుతోంది.

కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు బరితెగించారు.కబ్జాదారులతో చెట్టపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్న తీరు వివాదాస్పదం అవుతోంది. కిరాయిమూక ఆగడాలకు పోలీసులు సహకరిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.కానూరు ట్రస్ట్‌ భూముల వ్యవహారంలో కిరాయి మూకకు పోలీసులు అండగా నిలబడటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి పర్యవేక్షణలో కిరాయి మూక చెలరేగిపోతోంది.కిరాయి మూకతో కలిసి సివిల్‌ డ్రెస్‌లో పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారితో కలిసి పోలీసులు ఎన్‌ఆర్‌ఐపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు.

ఎన్‌ఆర్‌ఐ న్యాయ పోరాటంలో సహకరిస్తున్న వాందరినీ కిరాయి మూకతో కలిసి టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.హైకోర్టు ప్రాంగణంలో సైతం యథేచ్ఛగా తిరుగుతున్న రౌడీ మూక ఉదంతమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. న్యాయవాది పాలేటి మహేష్‌పై రెక్కీ నిర్వహించడంపై తోటి న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు తనపై రెక్కీని తీవ్రంగా పరిగణిస్తున్నారు న్యాయవాది పాలేటి మహేష్‌. న్యాయ సహాయం అందించేందుకు కూడా వీలులేని పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story