Vehicle Destruction : పోలీస్ స్టిక్కర్ ఉన్న వాహనం ధ్వంసం చేసిన కన్వరీలు

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో కన్వర్ యాత్రికులు రెచ్చిపోయారు. 'పోలీస్' సిక్టర్, సైరెన్ ఉన్న ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. కన్వరీలకు రిజర్వ్ చేసిన చిన్న వీధిలోకి వాహనం రావడంతో వారు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. వాహనంపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. అయితే అది ప్రైవేటు వాహనమని, అధికారిక పోలీసు వాహనం కాదని ఘటన అనంతరం పోలీసులు వివరణ ఇచ్చారు.
మధుబన్ బాఫుధామ్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని ఢిల్లీ-మీరట్ రోడ్డుపై ఉన్న దుహాయ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు వర్గాల కథనం ప్రకారం, సోమవారం ఉదయం 10.15 గంటల సమయంలో దుహాయ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక వాహనం కన్వర్ యాత్రికుని ఢీకొంది. దీంతో అక్కడున్న కొందరు కన్విరియాలు తీవ్ర ఆగ్రహంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని శాంతింపజేసి వెనక్కి పంపారు.
అవినాష్ త్యాగి అనే వ్యక్తి బొలెరో వాహనాన్ని నడుపుతూ కస్వరియా లేన్లోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో తేలింది. డ్రైవర్ ను, వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com