TG : కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్

TG : కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్
X

పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్ ను డీఈఓ సస్పెండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థినులతో తెలుగు ఉపాధ్యాయుడు నరేందర్ అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేయాలని పలువురు ఉపాధ్యాయులతో డీఈఓ రమేష్ కుమార్ కమిటీని వేశారు. కమిటీ పాఠశాలలో విచారణ చేపట్టగా తెలుగు ఉపాధ్యాయుడు నరేందర్ ఆరోపణలు నిజమని తేలాయి. దీంతో సదరు ఉపాధ్యాయుడిని డీఈఓ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు

Tags

Next Story