Kidney Racket : కిడ్నీ రాకెట్ నిందితుడు దేశం నుంచి జంప్.. లుకౌట్ నోటీసులు

సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పవన్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు వారాలుగా అతడి ఆచూకీ ఎక్కడా లభ్యం కాకపోవడంతో.. విదేశాలకు పారిపోయినట్లు గుర్తించిన పోలీసు అధికారులు.. అతడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో పవన్ కీలకంగా వ్యవహరించాడు. మరోవైపు, ఈ కేసు లో నిందితుడిగా ఉన్న లక్ష్మణ్ అనే వ్యక్తిని ఇటీవల అరె స్టుచేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ వ్య వహారంలో అతడు మధ్యవర్తిగా ఉంటూ కమీషన్లు దండుకొనే పాత్రలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. అంతేకాకుండా పవన్ కు లక్ష్మణ్ ముఖ్య అనుచరుడిగా ఉన్నట్లు భావిస్తున్నారు. లక్షలు తీసుకొని ఈ అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన విశాఖకు చెందిన డాక్టర్ రాజశేఖర్ ను విచారించారు. రాజశేఖర్ ను మూడు రోజుల కస్టడీకి కోర్టు అప్పగించగా.. తొలి రోజైన సోమవారం పోలీసులు విచారించారు. ఈ కేసులో మరిన్ని కోణాల్లో సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు మరో రెండు రోజుల పాటు నిందితులను విచారించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com