Vijayawada : కుటుంబం సామూహిక ఆత్మహత్య .. కీలక విషయాలు వెలుగులోకి ..!

Vijayawada :విజయవాడ కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు ముందు శ్రీలత, ఆశిష్.. 20 ఇన్సులిన్ బాటిల్స్‌ను ఇంజెక్ట్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మెడికల్ షాప్ నడపడంతో పాటు బీఫార్మసి చదవిన ఆశిష్‌కు మెడిసిన్స్‌పై అవగాహన ఉండటంతో.. ఆత్మహత్యకు ఇన్సులిన్ వినియోగించినట్లుగా భావిస్తున్నామన్నారు.
శరీరంలోకి ఇన్సులిన్ మితిమీరిన స్థాయిలో ఎక్కిస్తే షుగర్ డౌన్‌తో వ్యక్తి మృతి చెందే అవకాశముందన్నారు. సూసైడ్ గదిలో 20 ఇన్సులిన్ బాటిల్స్, సిరంజీలు గుర్తించామన్నారు. ఆత్మహత్యకు పాల్పడేముందు .. అర్థరాత్రి 2 గంటల సమయంలో శ్రీలత.. తన అన్నకు వాట్సప్ మెసెజ్ పెట్టిందన్నారు. దీంతో మృతురాలి అన్న ఆత్మహత్యకు సంబంధించి కన్యకాపరమేశ్వర సత్రంకు సమాచారం ఇచ్చారన్నారు.
మృతుడు సురేష్ సైతం బ్యారెజ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సురేష్ బంధువులకు సమాచారం ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com