Kidnapping : సంగారెడ్డిలో కిడ్నాప్​... బోరబండలో స్వాధీనం

Kidnapping : సంగారెడ్డిలో కిడ్నాప్​... బోరబండలో స్వాధీనం
X

సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మంగళవారం రాత్రి కిడ్నాప్​ నకు గురైన శిశువు ఆచూకీ దొరికింది. కిడ్నాపర్ల చెరనుంచి పోలీసులు బోరబండలో శిశువును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు మహిళలు కలిసి అపహరించినట్లు నిర్ధరించారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణి నాలుగో కాన్పు కోసం సోమవారం రాత్రి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరింది. సిజేరియన్‌ ద్వారా మహిళ ఆడశిశువుకు జన్మినిచ్చింది. కొంతసేపటికే ఆ శిశువు కనిపించకుండా పోయింది. బాధిత మహిళ, ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ ప్రసవ సమయంలో ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరగడం సీసీ కెమెరా ఫుటేజీలో నమోదైంది. దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు బోరబండలో శిశువును గుర్తించారు.

Tags

Next Story