UP : భర్తను చంపి.. ముక్కలుగా చేసి .. డ్రమ్ములో వేసి.. ప్రియుడితో పరార్

UP : భర్తను చంపి.. ముక్కలుగా చేసి .. డ్రమ్ములో వేసి.. ప్రియుడితో పరార్
X

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఘోరం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి ప్రేమించి పెళ్ళి చేసకున్న భర్తను చంపి ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములో వేసి ఎవరికీ అనుమానం రాకుండా దాంట్లో సిమెంట్ పోసి ప్రియుడితో పరారైందో భార్య. ఈ కేసులో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మర్చంట్ నేవీలో పనిచేస్తున్న సౌరభ్ రాజ్పుత్ మీరట్లోని ఇందిరానగర్ తన భార్య ముస్కాన్ రస్తోగి, ఐదేండ్ల కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కాగా ముస్కాన్.. సాహిల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం నడుపుతోంది. భర్తను అడ్డుతొలగించుకునేందుకు ఇద్దరూ కలిసి ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు. కత్తిపోట్లకు గురైన సౌరభ్ అక్కడికక్కడే మరణించాడు. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ లో వేసి, దుర్వాసన రాకుండా సిమెంట్, నీటితో కలిపిన మిశ్రమంతో నింపారు. తర్వాత ముస్కాన్ తన భర్తతో కలిసి హిమాచల్ వెళ్తున్నానని పొరుగువారికి చెప్పి వెళ్లిపోయింది. అయితే చాలా రోజులుగా సౌరభ్ కనిపించక పోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. ముస్కాన్ తన నేరాన్ని అంగీకరించి, తన ప్రేమికుడు సాహిల్తో కలిసి సౌరభ్ను హత్య చేశానని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తనిఖీ చేయగా ప్లాస్టిక్ డ్రమ్ కనిపించింది. అయితే డెడ్ బాడీని కప్పిపెట్టి సిమెంట్ పోయడంతో బిగుసుకుపోయింది. అతికష్టం మీద డ్రమ్ ను కత్తిరించి మృతదేహా న్నిబయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టాట్మార్టం కోసం పంపి, నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేశారు.

Tags

Next Story