Drugs case: సెలబ్రిటీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Drugs case: సెలబ్రిటీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
బిగ్‌ బాస్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్‌ అషురెడ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.


కబాలీ తెలుగు సినిమా నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్‌ బాస్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్‌ అషురెడ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఇక వారం రోజుల కిందట గోవా నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో మాదాపూర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం, రాజేంద్రనగర్‌ పోలీసులు కిస్మత్‌పూర్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద అరెస్టు చేశారు. చౌదరి సెల్‌ఫోన్‌లను స్వాదీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్‌ చాటింగ్స్, ఫొటోలు, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. ఆయా అంశాలపై స్పష్టత కోసం చౌదరిని రెండురోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు.

తరువాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలను తెలిపారు.పోలీసుల విచారణలో కేపీ చౌదరి.. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, ప్రముఖులు 12 మందికి కొకైన్‌ విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్‌ రోషన్, నల్లా రతన్‌ రెడ్డి, ఠాగోర్‌ విజ్‌, రఘు తేజ, వీరిలో ఉన్నారు. సెలబ్రిటీల కాంటాక్ట్‌లు, పార్టీ ఫొటోలను కేపీ చౌదరి గూగుల్‌ డ్రైవ్‌లో సేవ్‌ చేసుకున్నాడు. వాటిని పోలీసులు డీకోడ్‌ చేశారు. వీరంతా స్నేహిత హిల్స్‌లోని సిక్కీరెడ్డి నివాసంలో వేడుకలు చేసుకుంటూ కొకైన్‌ తీసుకునేవారని ఆధారాలు బయటపడ్డాయి.

మరోవైపు కేపీ చౌదరి, తన స్నేహితుడు బెజవాడ భరత్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లి అక్కడ డ్రగ్స్‌ పార్టీ నిర్వహించాడు. ఈ సమయంలో సురేష్‌ రాజు, రతన్‌ రెడ్డి, గోవాలోని మీరాజ్‌ క్లబ్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ దీక్షయ్, సినీ ఆర్టిస్టు జ్యోతి, డాక్టర్‌ సుధీర్‌లతో కేపీ చౌదరి వందలాది ఫోన్‌ కాల్స్‌ మాట్లాడినట్లు గుర్తించారు.ఇతర రాష్ట్రాలలో కూడా చౌదరికి డ్రగ్స్‌ కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలలో 11 అనుమానాస్పద లావాదేవీలు జరిపాడు. వీటిపైనా సరైన వివరణ ఇవ్వలేదు. అమెరికాలో ఉంటున్న దుగ్గిరాల అమర్‌ లక్షల్లో, గోవాలో రెస్టారెంట్‌ నిర్వాహకుడు మనీష్‌ సాహా 85 వేలు, షేక్‌ ఖాజా అనే వ్యక్తి 2 లక్షలు, బిహార్‌కు చెందిన కిన్‌షుక్‌ అగర్వాల్‌ 16 వేలు, టి.సుజాత అనే మహిళ లక్ష నగదును కేపీ చౌదరి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు తెలిపారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story