Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడుమూరులో బొలెరోను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. భాదితులు హోళగుంద మండలం కొత్తపేట గ్రామస్తులుగా గుర్తించారు.హోళగుంద నుంచి తెలంగాణకు వస్తుండగా కోడమూరు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర తెల్లవారుజామున ఈప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story