Crime News: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోలేదని పబ్లిక్‌లో 16 సార్లు..

Crime News: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోలేదని పబ్లిక్‌లో 16 సార్లు..
Crime News: ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు బాగా చదువుకుంటున్నారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.

Crime News: ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు బాగా చదువుకుంటున్నారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న వయసులోనే తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడెక్కడో చదువులు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు.. అయితే తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.. ప్రేమ అనే వలలో పడి యువతీ, యువకులు మోసపోతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బెంగళూరు మురుగేష్‌పాళ్యలో ఓ విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోనందని ఆమెను విచక్షణా రహితంగా పొడిచి చంపాడు ఓ యువకుడు.

ఆంధ్రప్రదేశ్‌ కాకినాడకు చెందిన లీలా పవిత్ర నలమతి మురుగేష్‌పాళ్యంలోని ఒమేగా హెల్త్‌కేర్‌లో ఉద్యోగం చేస్తోంది. శ్రీకాకుళానికి చెందిన దినకర్ మరో హెల్త్‌కేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. అయిదేళ్ల వారి ప్రేమను వివాహ బంధంతో ముడివేయాలనుకున్నారు. కానీ ఇద్దరి కులాలు వేరని లీల తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. తమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించరని, కుటుంబ సభ్యుల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని లీలా దినకర్‌కు తెలియజేసింది. దీంతో అతను ఆమెపై కోపం పెంచుకున్నాడు. అందుకే, లీల పని చేస్తున్న ఆఫీసుకి వచ్చి బయట వెయిట్ చేశాడు. ఆమె తన కార్యాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అతను తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి పబ్లిక్ చూస్తుండగా 16 సార్లకు పైగా పొడిచాడు. ఈ ఘటనపై జీవన్ భీమా నగర్ పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. దినకర్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story