Passenger Ishan Sharma Arrested : విమానంలో ఘర్షణకు దిగిన వ్యక్తి అరెస్టు

అమెరికాలోని ఫిడెల్ఫియా నుంచి మయామికి వెళ్తున్న ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానంలో జూన్ 30న జరిగిన ఘర్షణకు సంబంధించి నిందితుడు ఇషాన్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఇషాన్ శర్మ, కీను ఎవాన్స్ ఒకరినొకరు కాలర్ పట్టుకుని గొడవపడుతున్నారు. తోటి ప్రయాణికులు వారిని ఆపమని వేడుకుంటున్న వీడియో ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో న్యూవార్క్ నివాసి అయిన 21 ఏళ్ల ఇషాన్ శర్మ, కీను ఎవాన్స్ తీవ్రమైన ఘర్షణకు దిగారు. శర్మ ఎదుట సీటులో ఉన్న కీను ఎవాన్స్తో గొడవకు దిగాడు. అంతేకాకుండా అతడి గొంతు బిగించేశాడు. దీంతో ఊపి రాడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అంతటితో ఆగకుండా అతడి గొంతు కోసేశాడు. సహచర ప్రయాణికులు బెంబేలెత్తిపోయి.. ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఏ మాత్రం తగ్గలేదు.. తనకు కేటాయించిన సీటు దగ్గరకు వెళ్తుండగా తన మెడను పట్టుకున్నాడని ఎవాన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శర్మ గురించి విమాన సిబ్బందికి తెలియజేశానని.. అత్యవసర బటన్ నొక్కమని చెప్పారని పేర్కొన్నాడు. శర్మ తనను చంపుతానని బెదిరించాడని వాపోయాడు. ఇక మయామి విమానాశ్రయంలో విమానం దిగగానే శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణలో శర్మకు కూడా గాయాలయ్యాయి. అతని కంటిపై గాయాలు అయినట్లు కనిపించాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com