Shah Rukh Khan : షారూఖ్ ఖాన్ ను బెదిరించిన వ్యక్తి అరెస్టు

Shah Rukh Khan : షారూఖ్ ఖాన్ ను బెదిరించిన వ్యక్తి అరెస్టు
X

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 50 లక్షలు ఇవ్వాలని లేకుంటే చంపుతానని మహ్మద్ ఫైజాన్ ఖాన్ అనే న్యాయవాది డిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సదరు న్యాయవాదిని ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్లోని అతని నివాసంలో అరెస్టు చేశారు. అయితే ఫైజాన్ ఖాన్ మాత్రం తాను కాల్ చేయలేదని, బెదిరింపు కాల్ కు ఉపయోగించబడిన మొబైల్ గత వారం చోరీకి గురైందని చెప్పారు. దీనిపై నవంబర్ 2న పోలీసు కేసు కూడా పెట్టినట్టు ఆయన తెలిపారు. ఫైజాన్ ఖాన్ పై పోలీసులు బీఎన్ఎస్ 308(4), 351 (3), (4) కింద కేసులు నమోదు చేశారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో షారూఖ్ కు ప్రభుత్వం వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. ఆరుగురు సాయుధ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. గత వారం సల్మాన్ ఖాన్ ్కు ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట బెదిరింపులు రావడంతో ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. సల్మాన్ ను బెదిరించిన రాజస్థాన్ కు చెందిన 32 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుండి అతనికి బెదిరింపు వచ్చిన ఒక రోజు తర్వాత షారూఖ్ ఖాన్ కు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.

Tags

Next Story