Maharashtra: తల్లిపై అత్యాచారం కేసులో కొడుకుకు జీవితఖైదు..

Maharashtra: విచక్షణ కోల్పోయిన మనిషి ఎంతటి అఘాయిత్యానికి అయినా పాల్పడగలడు అనే మాటకు ఇప్పటికీ ఎన్నో ఉదాహరణలు చూశాం. దీని కారణంగానే హత్యలు, అత్యాచారాలు లాంటివి రోజురోజుకీ పెరిగిపోతున్నాయి కూడా. కుటుంబం అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటి ఒకటికి జీవిత ఖైదును వేసింది మహారాష్ట్ర కోర్టు.
మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కొడుకు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది ఆగస్టులో ఈ ఘటన జరగగా పోలీసుల దృష్టికి మాత్రం ఆలస్యంగా వచ్చింది. మద్యం మత్తులో తల్లిపై అత్యాచారం చేసిన ఈ కొడుకు కేసు కొన్ని నెలలుగా కోర్టులో ఉంది. తాజాగా కోర్టు అతడికి జీవితఖైదు విధించినట్టుగా ప్రకటించింది.
ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.2000 జరిమానా కూడా విధించింది కోర్టు. బాధితురాలికి రూ. 2 లక్షలు నష్టపరిహారం కూడా ప్రకటించింది. ఈ తీర్పు మరికొందరికి పాఠం అవ్వాలని ప్రజలు అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com