Meerpet: భర్తను వదిలి ఫోటోగ్రాఫర్‌తో ఎఫైర్.. పెళ్లి చేసుకోమని బెదిరించడంతో హత్య..

Meerpet: హైదరాబాద్ మీర్‌పేటలో ఫోటోగ్రాఫర్ హత్య కేసును పోలీసులు ఛేదంచారు. ప్రధాన నిందితురాలైన ఓ మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. న్యూడ్ ఫోటోలతో తనను బ్లాక్ చేయించినందునే అతనిని హత్య చేసినట్లుగా ప్రియురాలు అంగీకరించింది. బాగ్ అంబర్ పేట ప్రాంతానికి చెందిన యశ్విన్ కుమార్.. శ్వేతా రెడ్డితో 2018లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరి ఫేస్ బుక్ స్నేహం కొంత కాలం తరువాత వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ క్రమంలో వారి మధ్య న్యూడ్ వీడియో కాలింగ్ కొనసాగేది. అయితే తాజాగా తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతారెడ్డిపై యశ్విన్ కుమార్ ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే వివాహేతర సంబంధాన్ని బయట పెడతానని బెదిరించాడు. దీంతో వేధిపులు బరించలేకే తన ప్రియుడు.. మరో ఇద్దరితో కలిసి చంపించిన్లు శ్వేతారెడ్డి ఒప్పుకుంది. దీంతో రాచకొండ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.మీర్‌పేట్ ఫోటోగ్రాఫర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com