Anganwadi : అంగన్‌వాడీలో జాబ్స్ పేరుతో 20 మందిపై గ్యాంగ్‌రేప్
నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ఘోరంగా జరిగిపోతున్నాయి. అంగన్‌వాడీ జాబ్స్ (Anganwadi Jobs) ఇప్పిస్తామని చెప్పి 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు ఉద్యోగులు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది ఈ న్యూస్.
రాజస్థాన్‌లోని పాలి జిల్లా సిరోహి మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ మహేంద్ర మేవాడా (Mahendra Mewada), మాజీ కమిషనర్ మహేంద్ర చౌదరిపై (Mahendra Chaudhary) గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. సిరోహికి చెందిన ఈ ఇద్దరు అధికారులు అంగన్‌వాడీలో ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు మహిళలను నమ్మించి వారికి ఓ ప్రదేశంలో ఆశ్రయమిచ్చారు. అక్కడ వారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించారు. అనంతరం వారికి మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చి స్పృహలో లేని మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 20 మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే, భాదితురాల్లో పాలికి చెందిన ఓ మహిళ తను అత్యాచారానికి గురైనట్టు డీవైఎస్పీ పరాస్ చౌదరికి ఫిర్యాదు చేసింది. తనతో పాటు మరో పది పదిహేను మందికి ఓ చోట వసతి ఏర్పాటు చేసి, తినే ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చి వారిపై అత్యాచారం చేశారని పోలీసులకు వివరించింది. వీటిని ఫోన్ లో చిత్రీకరించి విషయం బయటకి రాకుడదంటూ తనను బెదిరించారని బాధితురాలు తెలిపింది. వీడియోలు తీసి ఒక్కొక్కరూ రూ.5లక్షలు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోలను వైరల్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు పోలీసులకు వివరించింది. హైకోర్టుకు కేసు చేరడంతో జడ్జి ఆదేశాల ప్రకారం అధికారులపై పోలీసులు కేసు పెట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com